లవ్‌ బాస్కెట్‌లో... | Anjali and Yogi Babu new movie begins shortley | Sakshi
Sakshi News home page

లవ్‌ బాస్కెట్‌లో...

Sep 13 2019 2:29 AM | Updated on Sep 13 2019 2:29 AM

Anjali and Yogi Babu new movie begins shortley - Sakshi

అంజలి

రెండేళ్లుగా హారర్‌ మూవీస్‌తో ప్రేక్షకులను భయపెట్టడానికే ఆసక్తి చూపించారు నటి అంజలి. ఈ రూట్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చి ప్రేక్షకులను నవ్వించాలని నిర్ణయించుకున్నారు. వినోద ప్రధానంగా సాగే ఓ  చిత్రంలో నటించడానికి అంగీకరించారామె. ఈ చిత్రానికి కృష్ణన్‌ జయరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ హిల్‌ స్టేషన్‌ నేపథ్యంలో జరుగుతుంది. ఓ ఆసక్తికర విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కమ్‌ కోచ్‌గా నటిస్తున్నారు అంజలి. ఈ పాత్ర కోసం ఆమె బాస్కెట్‌ బాల్‌లో శిక్షణ తీసుకున్నారు. అంజలిని లవ్‌ బాస్కెట్‌లో పడేయాలనుకునే పాత్రల్లో యోగిబాబు, రమర్‌ నటిస్తున్నారు. ‘‘ఫ్యాంటసీ కామిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతాం’’ అన్నారు కృష్ణన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement