ఫినిషింగ్‌ టచ్‌ | Akhil gives updates on 'Mr. Majnu' | Sakshi
Sakshi News home page

ఫినిషింగ్‌ టచ్‌

Nov 29 2018 3:13 AM | Updated on Jul 14 2019 10:21 AM

Akhil gives updates on 'Mr. Majnu' - Sakshi

అఖిల్‌

ప్రేమ కోసం లండన్‌ చుట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ ప్రేమ ప్రయాణం చేశాడు. ప్రసుతం ఈ ప్రయాణం ముగింపు దశకు వచ్చేసింది. డిసెంబర్‌ మొదటివారంలోపు ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నాం అన్నారు అఖిల్‌. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. నిధీ అగర్వాల్‌ కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

‘‘సినిమాకు సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. డిసెంబర్‌ 3వ తేదీకి టాకీ పార్ట్‌ పూర్తి చేస్తాం. కేవలం ఒక్క సెట్‌ సాంగ్‌ మినహా షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. జనవరిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్‌. ఇక ప్రమోషన్స్‌ టైమ్‌ స్టార్ట్‌ అయింది’’ అని పేర్కొన్నారు అఖిల్‌. ఈ సినిమాని జనవరి 25న రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా : జార్జి సి. విలియమ్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement