ప్రభాస్‌లా ఉన్నావన్నారు | Adrushyam Movie PRess Meet | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌లా ఉన్నావన్నారు

Jan 17 2019 12:31 AM | Updated on Jan 17 2019 12:31 AM

Adrushyam Movie PRess Meet - Sakshi

హీరోయిన్స్‌తో జాన్‌

హారర్, కామెడీ, థ్రిల్లర్‌ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘అదృశ్యం’. జాన్‌ హీరోగా, ప్రియాంక, హర్షద, తేజారెడ్డి, జయవాణి హీరోయిన్లుగా నటించారు. రవిప్రకాష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అయింది.  ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రవిప్రకాష్‌ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌ కె.విశ్వనాథ్‌గారి దగ్గర మొదలైంది.

తర్వాత సింగీతం శ్రీనివాస్‌గారి దగ్గర 14 సినిమాలు పని చేశా. వాళ్ల దగ్గర పని చేయడం నా అదృష్టం. నేను రూపొందించిన ‘బంటీ ది బ్యాడ్‌బాయ్‌’కు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘అదృశ్యం’ ఒక థ్రిల్లర్‌. టీమ్‌ అందరి కృషి వల్లే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఇది నా 3వ సినిమా. విశ్వనాథ్‌గారు నన్ను ప్రభాస్‌లా ఉన్నావు అన్నారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు జాన్‌. ఈ చిత్రానికి సంగీతం : ఆల్‌డ్రిన్, కెమెరా: రామ్‌ పినిశెట్టి.

Advertisement
 
Advertisement
Advertisement