తెరపైకి శ్రీదేవి కూతురు! | Actress Sridevi daughter jhanvi enter in cine field | Sakshi
Sakshi News home page

తెరపైకి శ్రీదేవి కూతురు!

Oct 6 2013 1:03 PM | Updated on Apr 3 2019 9:16 PM

జాహ్నవి, శ్రీదేవి - Sakshi

జాహ్నవి, శ్రీదేవి

హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్లు అవడంలో ఆశ్చర్యమేమీలేదు.

హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్లు అవడంలో ఆశ్చర్యమేమీలేదు. ఇటీవల ఈ సంఖ్య అధికమవుతోంది. అయితే తన కుమార్తెలను సినిమా వాతావరణానికి దూరంగా పెంచుతున్నానని శ్రీదేవి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె తన పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా తెరంగేట్రం చేయించనున్నట్లు తెలిసింది. రెండేళ్ల క్రితమే జాహ్నవిని హీరోయిన్‌గా నటింపజేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు.

అప్పుడు తన పిల్లలు చదువుకుంటున్నారని, వారికి నటించాలనే ఆలోచన లేదని శ్రీదేవి పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక సినిమా కార్యక్రమానికి శ్రీదేవి తన కూతురు జాహ్నవితో కలసి హాజరయ్యారు. అక్కడ అందరి దృష్టి జాహ్నవి మీదే పడింది. ఆమెకు హీరోయిన్‌ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ క్రమంలో జాహ్నవి సినీ రంగ ప్రవేశానికి శ్రీదేవి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. పలువురు దర్శకుల వద్ద శ్రీదేవి కథలు వింటున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement