మలయాళ పరిశ్రమ నన్ను మోసగించింది | Actress Poorna fire on Malayalam film industry | Sakshi
Sakshi News home page

మలయాళ పరిశ్రమ నన్ను మోసగించింది

Feb 21 2016 2:28 AM | Updated on Apr 3 2019 9:13 PM

మలయాళ పరిశ్రమ నన్ను మోసగించింది - Sakshi

మలయాళ పరిశ్రమ నన్ను మోసగించింది

మలయాళ చిత్రపరిశ్రమ నన్ను మోసం చేసింది అని ఆరోపణలు గుప్పిస్తున్నారు నటి పూర్ణ. విషయం ఏమిటంటే ఈ బ్యూటీ కేరళ కుట్టి అన్నది తెలిసిందే.

మలయాళ చిత్రపరిశ్రమ నన్ను మోసం చేసింది అని ఆరోపణలు గుప్పిస్తున్నారు నటి పూర్ణ. విషయం ఏమిటంటే ఈ బ్యూటీ కేరళ కుట్టి అన్నది తెలిసిందే. అలాంటిది మాతృభాషలో కంటే తమిళం, తెలుగు భాషల్లోనే మంచి అవకాశాలు వస్తున్నాయని పూర్ణ పేర్కొనడం గమనార్హం. ఈ భామ బహుభాషా నటి అన్నది తెలిసిందే. మలయాళంతో పాటు,తమిళం,తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి పేరే తెచ్చుకున్నారు.అయితే ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌ల్లోనే మంచి ఆదరణ లభిస్తోంది. మూడు పదుల వయసుకు చేరువవుతున్న పూర్ణకు ఇంట్లో వరుడి అన్వేషణ ఎక్కువైందట. పూర్ణ తన మనోభావాలను వెల్లడిస్తూ మలయాళంలో తనకు  మంచి అవకాశాలు అక్కడ లభించడం లేదన్నారు.
 
  కథలు వినిపించేటప్పుడు మంచి పాత్ర అని చెబుతున్నారని, షూటింగ్‌కు బయలు దేరిన తరువాత చిన్న వేషం ఇస్తున్నారని వాపోయారు. ఇలా పలు మలయాళ చిత్రాల్లో మంచి పాత్ర అని చెప్పి తనను మోసం చేశారని ఇది చాలా బాధాకరం అని అన్నారు. ఇకపోతే ఒక తెలుగు చిత్రంలో దెయ్యంగా నటించానన్నారు. ఆ చిత్రం చూసి ఒకరు గుండె ఆగి మరణించినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారని తెలిపారు. నిజానికి ఆ ప్రచారంలో నిజం లేదని అన్నారు. అదేవిధంగా ఒక చిత్రంలో గర్భిణిగా నటిస్తే పూర్ణ నిజంగానే గర్భం దాల్చిందనే వదంతులు హల్‌చల్ చేశాయన్నారు. ఇలాంటి అవాస్తవాలను ప్రసారం చేయడం బతికున్న వాళ్లను చంపినట్లేనన్నారు.
 
 అలాంటి ఫేస్‌బుక్‌లను నిషేధించాలని ఎవరైనా గొంతు ఎత్తితే నాను వారికి మద్దతిస్తానని తెలిపారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్న ్రపశ్నలు చుట్టుముట్టేస్తున్నాయని ఇంటో వాళ్లు వరుడి వేటలో ముమ్మరంగా ఉన్నారనీ, ఈ ఎడాది పెళ్లి చేయాలనే నిశ్చయానికి వచ్చారని చెప్పారు.ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సవరకత్తి, అర్జునన్ కాదలి, పడం పేసుమ్, మణల్ కయిరు-2 చిత్రాలతో పాటు తెలుగు ఒకసారి అవును ఒకసారి కాదు, సర్వమంగళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement