చెక్బౌన్సు కేసు.. జీవితకు బెయిల్ | actress Jeevitha gets bail | Sakshi
Sakshi News home page

చెక్బౌన్సు కేసు.. జీవితకు బెయిల్

Nov 24 2014 4:33 PM | Updated on Jul 11 2019 7:42 PM

చెక్బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు బెయిల్ లభించింది.

హైదరాబాద్ : చెక్బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు బెయిల్ లభించింది. సోమవారం మధ్యాహ్నం జీవిత 25 లక్షల రూపాయల జరిమానాను చెల్లించడంతో ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కోర్టు జీవితకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన వెంటనే జీవిత కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. అందుకు సామ శేఖర్రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు జరిమానా, జైలుశిక్ష విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement