బీచుపల్లిలో వివాహాల సందడి | marriages in telangana districts | Sakshi
Sakshi News home page

బీచుపల్లిలో వివాహాల సందడి

Mar 5 2018 11:25 AM | Updated on Sep 6 2018 3:01 PM

marriages in telangana districts - Sakshi

ఇటిక్యాల(అలంపూర్‌): వివాహాలకు మంచి ముహూ ర్తం ఉండడంతో ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఎక్కడ చూసినా ఆలయాలు, కళ్యాణ మండపాల్లో పెళ్లి సందడి కనిపించింది. ఇక జోగుళాంబ గద్వాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బీచుపల్లిలో ఒకేరోజు 20 వివాహాలు జరిగాయి. పుణ్యక్షేత్రంలోని టీటీడీ, కోదండ రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో మొత్తం 20 వివాహాలు జరిగాయని సిబ్బంది తెలిపారు. ఆయా వివాహాలకు హాజరైన భక్తులతో బీచుపల్లి కిక్కిరిసిపోయి కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement