విషాదం: పెళ్లైన నిమిషాల్లోనే ఓ జంట.. | Newly Couple Died In An Accident In Texas | Sakshi
Sakshi News home page

ఆశలు సమాధి చేస్తూ...

Aug 25 2019 5:25 PM | Updated on Aug 25 2019 6:44 PM

Newly Couple Died In An Accident In Texas - Sakshi

టెక్సాస్‌ : కలకాలం కలిసి జీవిద్దామనుకున్నారు కానీ విధి వారితో చెలగాటమాడింది. ఆఖరికి మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. వివాహం అయిన కొద్ది నిమిషాలకే నూతన వధూవరులు మరణించిన విషాదకర సంఘటన శుక్రవారం టెక్సాస్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. టెక్సాస్‌కు చెందిన హార్లే మార్గన్‌, రియానా బోడ్రెక్స్‌ల జంటకు ఈ శుక్రవారం డుబోస్-సిమోంటన్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. దురదృష్టం ఆ కొత్త జంటను వెంటాడింది. జస్టిస్ ఆఫ్ ది పీస్ భవనం నుండి బయలుదేరే సమయంలో వరుడు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఈ  క్రమంలో భారీ ట్రక్ వారు ప్రయాణిస్తున్న కారులోకి  దూసుకెళ్లింది. దీంతో పెళ్లై నిమిషాలు గడవక ముందే హార్లే మార్గన్‌, రియానా బోడ్రెక్స్‌లు మృత్యువాత పడ్డారు. పెళ్లి జరిగి నిమిషాలు గడవక ముందే కొడుకు,కోడలు ప్రమాదంలో మరణించటతో  హార్లే మార్గన్‌ తల్లి కన్నీరుమున్నీరైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement