590 జీన్స్ ప్యాంట్లతో గిన్నిస్ రికార్డు కోసం.. | Japanees village Hokkaido bid for world record with 295 pairs of frozen jeans | Sakshi
Sakshi News home page

590 జీన్స్ ప్యాంట్లతో గిన్నిస్ రికార్డు కోసం..

Feb 22 2016 5:05 PM | Updated on Sep 3 2017 6:11 PM

590 జీన్స్ ప్యాంట్లతో గిన్నిస్ రికార్డు కోసం..

590 జీన్స్ ప్యాంట్లతో గిన్నిస్ రికార్డు కోసం..

అయితే వాళ్లకు శ్రీశ్రీలు లేరుకాబట్టి, చేసిన పనిని రికార్డుల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారుకాబట్టీ ఇప్పుడిది వార్తయింది. ఇంతకీ ఆ జపానోళ్లు చేసిందేమంటే..

'కుక్కపిల్లా,అగ్గిపుల్లా,సబ్బుబిళ్ళా.. హీనంగా చూడకు దేన్నీ, కవితామయమేనోయ్ అన్నీ!'అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు కాబట్టి జపనీయులు చేసిన ఈ వింత ప్రయత్నం మనకేమంత కొత్తగా అనిపించకపోవచ్చు.  అయితే వాళ్లకు శ్రీశ్రీలు లేరుకాబట్టి, చేసిన పనిని రికార్డుల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారుకాబట్టీ ఇప్పుడిది వార్తయింది. ఇంతకీ ఆ జపానోళ్లు చేసిందేమంటే 590 జీన్స్  ప్యాంట్లను ఆరుబయట ఉంచడం!

'ఓసోస్.. ఇదికూడా ఓ రికార్డేనా!' అనేముందు మరోసారి శ్రీశ్రీని గుర్తుచేసుకోమని మనవి. జపాన్ ఉత్తర ప్రాంతంలోని హొక్కాయిదో దీవిని ప్రస్తుతం మంచుదుప్పటి కప్పేసింది. కనీవినీ ఎరుగనట్లు అక్కడ మైనస్ 5.3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. గజగజా వణికించే చలిలే ఏదోఒకటి చేయాలనే సంకల్పించిన హొక్కాయిదో వాసులు చివరికిలా జీన్స్ ప్యాంట్లను చలిలో గడ్డకట్టించే(!) రికార్డు యత్నం చేశారు.

ఆదివారం సాయంత్రం ప్రారంభించిన ఈ వింత యజ్ఞంలో చిన్నాపెద్దా అంతాకలిపి 120 మంది పాల్గొన్నారు. అయితే దీనిని రికార్డుగా గుర్తిస్తున్నట్లు గిన్నిస్ బుక్ వారు ఇంతవరకు ప్రకటించకపోవడంతో 'గిన్నిస్ లో చోటు దక్కేదాకా జీన్స్ ప్యాంట్లను ఇంకాఇంకా గడ్డకట్టిస్తూనే ఉంటాం' అని ప్రకటించారు హొక్కాయిదో వాసులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement