26/11పై మరిన్ని ఆధారాలు ఇవ్వండి: పాక్ | Give more evidence on 26/11: Pak | Sakshi
Sakshi News home page

26/11పై మరిన్ని ఆధారాలు ఇవ్వండి: పాక్

Jul 1 2016 2:56 AM | Updated on Sep 4 2017 3:49 AM

ముంబై నగరంపై 2008 నవంబరు 26న జరిగిన దాడులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసేందుకు తమకు మరిన్ని ఆధారాలు అందివ్వాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది

ఇస్లామాబాద్: ముంబై నగరంపై 2008 నవంబరు 26న జరిగిన దాడులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసేందుకు తమకు మరిన్ని ఆధారాలు అందివ్వాలని  భారత్‌ను పాకిస్థాన్ కోరింది. పాక్ విదేశాంగ కార్యదర్శి, భారత విదేశాంగ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. ఈ కేసులో లష్కరే తోయిబా కమాండర్ జకీ-ఉర్ రెహ్మాన్ లఖ్వీతోపాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు.

భారత్ ఈ లేఖకు ఇంకా స్పందించలేదు. ఈ కేసులో అరెస్టయి, ఏడాది క్రితం విడుదలైన లఖ్వీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఆరేళ్లుగా సాగుతున్నఈ కేసు విచారణను తొంద రగా ముగించాలని కోరుతున్న భారత్.. అన్ని ఆధారాలను ఇప్పటికే అందించింది.

Advertisement
 
Advertisement
Advertisement