ఇండోనేసియాలో మళ్లీ భూప్రకంపనలు | Earthquake measuring 6.2 on richter scale strikes off Lombok, Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో మళ్లీ భూప్రకంపనలు

Jun 9 2016 10:16 AM | Updated on Sep 4 2017 2:05 AM

ఇండోనేసియాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది.

జకర్తా: ఇండోనేసియాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. లాంబోక్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ వారంలో ఇండినేషియాలో భూకంపం రావడం ఇది మూడోసారి. నేటి ఉదయం మరోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. గత వారం రోజుల్లో ఇండోనేసియా ఉత్తర ప్రాంతంలో చాలా చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. కాగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇదివరకే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement