యాంటీ- పారాసైట్‌ డ్రగ్‌తో అద్భుత ఫలితాలు!?

Bangladesh Doctors Say Anti Parasite Drug Usage Gives Good Results Covid 19 - Sakshi

నమ్మశక్యం కాని ఫలితాలు పొందాం: బంగ్లాదేశ్‌ వైద్య నిపుణులు

ఢాకా: యాంటీ- పారాసైట్‌ డ్రగ్‌, ప్రతిరక్షకాల కాంబినేషన్‌తో మహమ్మారి కరోనాను కట్టడి చేయవచ్చంటున్నారు బంగ్లాదేశ్‌ వైద్య నిపుణులు. కరోనా పేషెంట్ల చికిత్సలో భాగంగా ఈ కాంబినేషన్‌ను ఉపయోగించినపుడు అద్బుతమైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. అంతేగాక వీటితో రోగులకు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని పేర్కొన్నారు. ఈ విషయం గురించి బంగ్లాదేశ్‌ మెడికల్‌ హాస్పిటల్‌ వైద్య విభాగం అధిపతి డాక్టర్‌ మహ్మద్‌ తారిక్‌ ఆలం మాట్లాడుతూ.. డజన్ల సంఖ్యలో కోవిడ్‌ రోగులకు యాంటీ పారాసైట్‌ డ్రగ్‌, యాంటిబయోటిక్‌లు ఇచ్చామని.. ఈ క్రమంలో వారు నాలుగు రోజుల్లోనే కోలుకున్నారని చెప్పుకొచ్చారు. తల పేన్లు, గజ్జి, దురద నుంచి విముక్తి పొందేందుకు వాడే డీ- వార్మింగ్‌(పురుగులను నిర్మూలించే ప్రక్రియ) చికిత్స విధానంతో నమ్మకం శక్యం కాని ఫలితాలు పొందామని తెలిపారు. (సెప్టెంబర్‌లో వ్యాక్సిన్‌ సరఫరా షురూ)

ఇలా దాదాపు 60 పేషెంట్లకు ఈ మెడికేషన్‌ అందించగా.. వారంతా కోలుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాగా పరాన్నజీవులను అంతమొందించే ఇవర్‌మెక్టిన్‌ ప్రక్రియ ద్వారా కణజాలాల్లో కరోనా వైరస్‌ అభివృద్ధి చెందకుండా.. దాని ప్రభావాన్ని కట్టడి చేయవచ్చని స్థానిక వార్తా సంస్థ గత నెలలో ఓ అధ్యయానికి సంబంధించిన కథనాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. ఇక మానవాళి మనుగడకు సవాల్‌ విసిరిన కరోనాకు ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. అమెరికా, బ్రిటన్‌, భారత్‌, చైనా, ఇటలీ సహా పలు దేశాల పరిశోధకులు మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నారు.

ఈ క్రమంలో​ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరించి.. సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్‌ సరఫరాలను చేపడతామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా గురువారం శుభవార్తను చెప్పింది. కాగా యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కూడా కరోనా పేషెంట్ల చికిత్సలో సత్ఫలితాలనిస్తుందని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరించారు. (ఆ డ్రగ్‌ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్‌)

కోవిడ్‌ కట్టడికి డ్రగ్‌ అభివృద్ధి: చైనా శాస్త్రవేత్తలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

03-06-2020
Jun 03, 2020, 04:41 IST
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువగా...
03-06-2020
Jun 03, 2020, 04:30 IST
సాక్షి, అమరావతి:  కరోనా నియంత్రణలో దేశానికే ఆంధ్రప్రదేశ్‌ రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. కేసులు ఎన్ని వస్తున్నాయన్నది కాకుండా, వైరస్‌ను కట్టడి చేయడమే...
03-06-2020
Jun 03, 2020, 03:33 IST
సాక్షి, హైదరాబాద్‌: దగ్గు.. జ్వరం.. ముక్కు కారటం.. శ్వాసకోశ సంబంధ సమస్యలే కరోనా లక్షణాలని భావించాం.. కానీ ఒక్కోసారి వాంతులు,...
02-06-2020
Jun 02, 2020, 18:35 IST
న్యూఢిల్లీ: శానిటైజ‌ర్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మ‌హా న‌గ‌రం నుంచి మారుమూల ప‌ల్లె వ‌ర‌కు ఇది వాడ‌ని వారే లేరంటే అతిశ‌యోక్తి...
02-06-2020
Jun 02, 2020, 16:34 IST
సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది.
02-06-2020
Jun 02, 2020, 16:32 IST
 సాక్షి, విజయవాడ :  లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలల తరువాత రైళ్లు, విమానాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది....
02-06-2020
Jun 02, 2020, 15:57 IST
ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు....
02-06-2020
Jun 02, 2020, 15:50 IST
తొలి కరోన కేసు బయట పడినప్పటికీ ఎపిడమాలోజిస్ట్‌లను సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని నివేదిక పేర్కొంది. 
02-06-2020
Jun 02, 2020, 14:51 IST
సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు...
02-06-2020
Jun 02, 2020, 14:44 IST
సాక్షి, ‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, ప్రత్యేక రైళ్లను...
02-06-2020
Jun 02, 2020, 14:13 IST
అనుమతి ఇవ్వండి.. యుద్దంలో గెలిచి చూపిస్తాను
02-06-2020
Jun 02, 2020, 13:58 IST
సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం  ‘‘ఢిల్లీ కరోనా" యాప్ ను...
02-06-2020
Jun 02, 2020, 13:20 IST
అచ్చంపేట: కరోనా వైరస్‌ వ్యాధితో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం పట్టణంలోని మధురానగర్‌కాలనీలో పాజిటివ్‌ కేసు నమోదు కావటంతో ఆ...
02-06-2020
Jun 02, 2020, 13:08 IST
జెనీవా:  కరోనా వైరస్‌​ ఇక  తమ దేశంలో లేదంటూ  ప్రకటించిన ప్రముఖ ఇటాలియన్ వైద్యుడు వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ...
02-06-2020
Jun 02, 2020, 12:32 IST
బాలీవుడ్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు , గాయ‌కుడు వాజీద్ ఖాన్ (42) అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని చెంటూర్ ఆసుప‌త్రిలో క‌న్నుమూసిన...
02-06-2020
Jun 02, 2020, 11:23 IST
బ్రస్సెల్స్: ‘క్వారంటైన్‌ నియమాలు ఉల్లంఘించి ఓ సామాజిక కార్యక్రమానికి హాజరయ్యాను. క్షమించండి’ అంటూ బెల్జియన్‌ యువరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. బెల్జియం...
02-06-2020
Jun 02, 2020, 11:07 IST
సాక్షి,సిటీబ్యూరో:గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా సోమవారం మరో 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం  అత్యధికంగా 122...
02-06-2020
Jun 02, 2020, 09:35 IST
అహ్మ‌దాబాద్ : భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తోంది. సామాన్య ప్ర‌జానీకం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు...
02-06-2020
Jun 02, 2020, 09:22 IST
బర్త్‌డే పార్టీని మించిన ఈవెంట్‌ ఉండదు లోకంలో. ఎవరికి వారే కింగ్‌ / క్వీన్‌ ఆ రోజు. సెంటర్‌ ఆఫ్‌...
02-06-2020
Jun 02, 2020, 09:16 IST
కోవిడ్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధానికి సాధనాలుగా, ఆయుధాలుగా కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఈ వెదురు ఫర్నిచర్‌....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top