చైనా: నదిలో మునిగి 8మంది విద్యార్థుల మృతి | 8 Young Children Drown In River In Chongqing | Sakshi
Sakshi News home page

నదిలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

Jun 22 2020 8:11 AM | Updated on Jun 22 2020 8:20 AM

8 Young Children Drown In River In Chongqing - Sakshi

బీజింగ్‌: నదీ తీరంలో సరదాగా ఆడుకోవడానికి వెళ్లి 8 మంది విద్యార్థులు చనిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాలోని చోంగ్‌ కింగ్‌ నగరంలో ఆదివారం రోజున పాఠశాల విద్యార్థులు నది వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఓ విద్యార్థి నదిలో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు అలా మరో ఏడుగురు విద్యార్థులు నదిలోకి దూకారు. దీంతో 8 మంది విద్యార్థులు కూడా నీట మునిగిపోయారు. అయితే.. వీరి మృతదేహాలను సోమవారం ఉదయం నది నుంచి వెలికి తీశారు. కాగా.. వీరిని సిచువాన్‌ ప్రావిన్స్‌ సమీపంలోని మిక్సిన్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: భారత్, చైనాలతో మాట్లాడుతున్నాం: ట్రంప్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement