బస్సు - ట్రక్ ఢీ: 18 మంది మృతి | 18 killed, 31 injured in bus-truck collision in Nepal | Sakshi
Sakshi News home page

బస్సు - ట్రక్ ఢీ: 18 మంది మృతి

May 1 2014 10:37 AM | Updated on Sep 2 2017 6:47 AM

పశ్చిమ నేపాల్లోని పర్వత ప్రాంతంలో బస్సు, ట్రక్ ఢీ కొని 18 మంది మృతి చెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

పశ్చిమ నేపాల్లోని పర్వత ప్రాంతంలో బస్సు, ట్రక్ ఢీ కొని 18 మంది మృతి చెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. అగ్రాకచ్చి జిల్లాలోని బుత్వాల్ వైపు వెళ్తున్న బస్సు.... ఎదరుగా వస్తున్న ట్రక్ను నార్పనీ ప్రాంతంలో ఢీ కొట్టిందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన 23 మంది క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా వైద్య సహాయం కోసం బుత్వాల్లోని లుంబిని జోనల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

 

ట్రక్ను ఢీ కొన్న బస్సు దాదాపు 150 మీటర్ల మేర పర్వత ప్రాంతం నుంచి కిందకి పడిపోగా... దాదాపు 200 గ్యాస్ సిలెండర్లతో వెళ్తున్న ట్రక్ మాత్రం రోడ్డుపై తిరగబడిందన్ని పేర్కొన్నారు.  అయితే ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్, మరో ముగ్గురు ట్రక్ నుంచి దూకి వేసినట్లు చెప్పారు. మృతులు, క్షతగాత్రులంతా బస్సులోని ప్రయాణికులేని పోలీసులు వివరించారు. ఆ ప్రమాద సంఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి జీపులో బయలుదేరారు. ఆ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాద స్థలంలో బోల్తా పడింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement