రాజమండ్రికి బయల్దేరిన వైఎస్ జగన్ | YS JAGAN rushes to Rajahmundry, console the gandepalli victims family members | Sakshi
Sakshi News home page

రాజమండ్రికి బయల్దేరిన వైఎస్ జగన్

Sep 14 2015 11:55 AM | Updated on Jul 25 2018 4:07 PM

రాజమండ్రికి బయల్దేరిన వైఎస్ జగన్ - Sakshi

రాజమండ్రికి బయల్దేరిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి వెళ్లనున్నారు.

హైదరాబాద్:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రికి బయల్దేరారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు. కాగా క్షతగాత్రులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  మృతుల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు.

ఈ దుర్ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. మరోవైపు గండేపల్లి  ప్రమాదం జరిగిన విషయం తెలియగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు.  పార్టీ నేత జ్యోతుల నెహ్రూ నుంచి ప్రమాద వివరాలను వైఎస్‌ జగన్‌ తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని పార్టీ నేతలను జగన్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement