భర్త మందలించడంతో.. భార్య ఆత్మహత్యాత్నం | wife committed suicide | Sakshi
Sakshi News home page

భర్త మందలించడంతో.. భార్య ఆత్మహత్యాత్నం

Aug 28 2016 8:43 PM | Updated on Nov 6 2018 8:04 PM

తనకు తెలియకుండా సెల్‌ఫోన్ ఎలా కోనుగోలు చేసావని భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్యానికి పాల్పడింది.

తనకు తెలియకుండా సెల్‌ఫోన్ ఎలా కోనుగోలు చేసావని భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన మహేందర్, స్రవంతి(23) దంపతులు. వీరు జీవనోపాధి కోసం ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చి బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలో ఓ అపార్ట్‌మెంటులో వాచ్‌మెన్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా స్రవంతి రెండు రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కోనుగోలు చేసింది. దానిని శనివారం భర్త గమనించి నాకు తెలియకుండా సెల్‌ఫోన్ ఏలా కోనుగోలు చేశావని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి గుర్తు తెలియని విషం సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement