'తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంలేదు' | We are not believe Telangana government | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంలేదు'

Aug 12 2014 2:41 PM | Updated on Sep 2 2017 11:47 AM

'తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంలేదు'

'తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంలేదు'

మీరు ఏ పథకమైనా పెట్టుకోండి ఏ రోజు అడ్మిషన్ అయితే ఆ రోజే ఫీజులు చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి రమేష్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: మీరు ఏ పథకమైనా పెట్టుకోండి ఏ రోజు అడ్మిషన్ అయితే ఆ రోజే ఫీజులు చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద నమ్మకం లేకనే అడ్మిషన్‌ రోజునే ఫీజులు చెల్లించాలని అడుగుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 31లోపు పాత బకాయిలన్నీ చెల్లించాలని ఆయన కోరారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో పాత విధానాలే కొనసాగించాలన్నారు.

ఇదిలా ఉండగా,  తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) కమిటీ ప్రశ్నలకు రమేష్ ఘాటుగా స్పందించారు. మీరు కాలేజీలు వ్యాపారంలాగా పెట్టుకున్నారా? అని కాలేజీ యాజమాన్యాలను  ఫాస్ట్ కమిటీ ప్రశ్నించింది. తాము వ్యాపారం చేయడం కాదు, తమ  డబ్బులతోనే జెఎన్టియు, ఎంసెట్ ఆఫీసులు నడుస్తున్నాయని రమేష్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement