ఆ 11మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్లు | telangana government gives postings to 11 teachers | Sakshi
Sakshi News home page

ఆ 11మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్లు

Sep 16 2016 7:47 PM | Updated on Sep 2 2018 5:24 PM

పీఎస్లుగా ఉన్న 11మంది ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగ్లు కేటాయించింది.

హైదరాబాద్ : పీఎస్లుగా ఉన్న 11మంది ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగ్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్కు ములుగు మండలం క్షీరసాగర్లో పోస్టింగ్ ఇచ్చింది. కాగా  ఉపాధ్యాయులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏ, పీఎస్లుగా కొనసాగేందుకు వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.. వారంలోగా పాఠశాలలకు వారిని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టీచర్లను పీఎస్లుగా తొలగించింది. వీరంతా అక్టోబర్ 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement