సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య | Techie commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Mar 4 2015 6:12 AM | Updated on Nov 6 2018 7:56 PM

సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - Sakshi

సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ : వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, మృతుడి సహోద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకట్రెడ్డి (30) గచ్చిబౌలిలోని డీఎస్టీ వరల్డ్ సాప్ట్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వివాహమైన అతడు ..భార్యతో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నాడు.

కాగా మంగళవారం మధ్యాహ్నం  మూడు గంటలకు చందానగర్ రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి వైపు వెళుతున్న రైలుకు వెంకట్రెడ్డి ఎదురుగా వెళ్లటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. కాగా వెంకట్రెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో కలిసి మెలిసి ఉండేవాడని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement