కాచిగూడ-టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు | special trains between kacheguda-tatanagar | Sakshi
Sakshi News home page

కాచిగూడ-టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు

May 18 2016 8:44 PM | Updated on Sep 4 2017 12:23 AM

వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ-టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే  కాచిగూడ-టాటానగర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాచిగూడలో జూన్ 6, 13, 20, 27 తేదీల్లో(సోమవారాలు)  మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో... టాటానగర్‌లో జూన్ 7, 14, 21, 28 తేదీల్లో(మంగళవారాలు) రాత్రి 10.50కి బయలుదేరుతుంది.

ఇవి మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, సుకింద రోడ్డు, జరోలి, బన్స్‌పానీ, చైబాసా స్టేషన్ల మీదుగా వెళ్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement