రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి | Some unknown person killed in a train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

Aug 30 2016 5:35 PM | Updated on Sep 4 2018 5:21 PM

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి (30) ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫారం లేని సైడ్‌నుంచి కదులుతున్న ఎంఎంటిఎస్ రైలు ఎక్కి ప్రమాద వశాత్తు రైలు కింద పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. మృతుని ఒంటిపైన లేత నీలం రంగు నిలువు గీతల ఫుల్‌షర్టు, లోవర్ మోడల్ ఫ్యాంట్ ఉంది. చేతికి రాఖీ కట్టుకుని ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement