స్థానికత ఆధారంగా విభజన చేయండి | Secretariat 'D' block, employees protest | Sakshi
Sakshi News home page

స్థానికత ఆధారంగా విభజన చేయండి

Jun 16 2016 4:01 AM | Updated on Sep 4 2017 2:33 AM

స్థానికత ఆధారంగా విభజన చేయండి

స్థానికత ఆధారంగా విభజన చేయండి

స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలంటూ సచివాలయ ఉద్యోగులు ‘డి’ బ్లాక్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు.

సచివాలయంలోని ‘డి’ బ్లాక్‌లో ఉద్యోగులు ధర్నా

 సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలంటూ సచివాలయ ఉద్యోగులు ‘డి’ బ్లాక్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీ స్థానికత కలిగిన 83 మంది సెక్షన్ అధికారులు, 15 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులను తెలంగాణకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంట పాటు ఆందోళన చేశారు. ‘తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల పెత్తనమా..సిగ్గు సిగ్గు’, ‘ఏఎస్‌ఓలకు వెంటనే ఎస్‌వోలుగా పదోన్నతులు కల్పించాలి’, అని ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు.

ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కొందరు ఉన్నతాధికారులు సీఎంని తప్పుదోవ పట్టించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులకు కొత్త రిక్రూట్‌మెంట్, పదోన్నతులు లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement