'సీమకు దక్కకుండా చేశారు' | S Sailajanath takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'సీమకు దక్కకుండా చేశారు'

Nov 28 2015 1:09 PM | Updated on Mar 18 2019 7:55 PM

'సీమకు దక్కకుండా చేశారు' - Sakshi

'సీమకు దక్కకుండా చేశారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర రాజధాని రాయలసీమకు దక్కకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు సొంత జిల్లాలో తాగునీటి పథకం రద్దు చేశారని మండిపడ్డారు. తాగునీటి పథకానికి గత ప్రభుత్వం రూ. 7, 390 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.

అన్ని నిధులు కేటాంచిన ఆ పథకాన్ని ఇప్పుడు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పథకాలను రద్దు చేయడం వెనక మతలబు ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement