‘సాక్షి’ ఈడీగా కె.రామచంద్రమూర్తి | ramachandra murthy takes over as ED of Sakshi | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఈడీగా కె.రామచంద్రమూర్తి

Sep 7 2014 1:17 AM | Updated on Sep 27 2018 5:03 PM

‘సాక్షి’ ఈడీగా కె.రామచంద్రమూర్తి - Sakshi

‘సాక్షి’ ఈడీగా కె.రామచంద్రమూర్తి

సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి ‘సాక్షి’ మీడియా గ్రూపులో ఎడిటోరియల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు.

సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి ‘సాక్షి’ మీడియా గ్రూపులో ఎడిటోరియల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. పాత్రికేయ రంగంలో విశేష అనుభవం ఉన్న రామచంద్రమూర్తి పలు మీడియా సంస్థల ద్వారా సమాజానికి విశిష్ట సేవలు అందించారు. ఆయన అనుభవం ‘సాక్షి’ మీడియా గ్రూపు సంస్థల ఉన్నతికి, వాటి ద్వారా సమాజ ఉన్నతికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం.
 
 ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆలంబనగా నిలుస్తూ ‘సాక్షి’ సాగిస్తున్న ప్రస్థానాన్ని మరింత మెరుగుపరిచే కృషిలో ఇది ఒక భాగం. కుల, మత, ప్రాంతీయ, రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని రకాల వార్తలను యథాతథంగా, సత్యనిష్ఠతో, జనస్వామ్య స్ఫూర్తితో అందజేసే ‘సాక్షి’ సంప్రదాయ ఒరవడి ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా ‘సాక్షి’ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది. నాణేనికి రెండు పక్కలా  ఏముందో చూపెట్టడం సాక్షి నిర్దేశిత విధానం. ప్రజా సమస్యలను ఎత్తి చూపడం - వాటి పరిష్కారానికి గొంతెత్తడం ‘సాక్షి’ విద్యుక్త ధర్మం.
 - ఎడిటర్, సాక్షి
 

Advertisement
 
Advertisement
Advertisement