సీ బ్లాక్లో అగ్నిప్రమాదంపై విచారణ | police begins enquiry in Secretariat fire incident | Sakshi
Sakshi News home page

సీ బ్లాక్లో అగ్నిప్రమాదంపై విచారణ

Apr 28 2014 10:30 AM | Updated on Sep 5 2018 9:51 PM

సీ బ్లాక్లో అగ్నిప్రమాదంపై విచారణ - Sakshi

సీ బ్లాక్లో అగ్నిప్రమాదంపై విచారణ

సచివాలయం సీ బ్లాక్లో అగ్నిప్రమాదంపై విచారణ ప్రారంభం అయ్యింది. డీసీపీ కమలాసన్ రెడ్డి విచారణ జరుపుతున్నారు.

హైదరాబాద్ : సచివాలయం సీ బ్లాక్లో అగ్నిప్రమాదంపై విచారణ ప్రారంభం అయ్యింది. డీసీపీ కమలాసన్ రెడ్డి విచారణ జరుపుతున్నారు. సాధారణ పరిపాలనాశాఖ ఉన్నతాధికారులు సోమవారం విచారణకు హాజరయ్యారు. కాగా ముఖ్యమైన ఫైళ్లు దగ్ధం కాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్థారణ అయ్యింది.

ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్సీడీ (ఐపీఎస్ అధికారుల సర్వీసు రికార్డులు, నక్సల్కు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని ఇందులో భద్రపరుస్తారు) విభాగం నుంచి పొగలు రావటం గమనించిన సిబ్బంది వెంటనే ఫైరింజన్ సాయంతో మంటల్ని ఆర్పివేశారు. ప్రమాదంలో ఎస్సీడీ విభాగానికి చెందిన ఒక రూం కాలిపోయింది. మరోవైపు ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement