కారు బీభత్సం.. మహిళ మృతి | one women dies as car rams into public in hyderabad | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం.. మహిళ మృతి

Dec 25 2016 7:39 PM | Updated on Aug 30 2018 4:10 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జనాల పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కీసర: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జనాల పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటన కీసర మండలం చీర్యాల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లావణ్య అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. చిరు వ్యాపారితో పాటు మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement