breaking news
cheeryala
-
కారు బీభత్సం.. మహిళ మృతి
కీసర: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జనాల పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటన కీసర మండలం చీర్యాల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లావణ్య అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. చిరు వ్యాపారితో పాటు మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
కీసర: కన్నతండ్రికి ఓ కూతురు తలకొరివి పెట్టింది. ఈ సంఘటన కీసర మండలంలో చీర్యాలలో మంగళవారం జరిగింది. చీర్యాల గ్రామానికి చెందిన బోడ బాలయ్య(84)కు ఆరుగురు కుమార్తెలు. కుమారులు లేరు. బాలయ్య మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించాడు. దీంతో బాలయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు ఆయన చిన్నకూతురు నల్లోల్ల అనురాధ ముందుకొచ్చింది. తండ్రికి తలకొరివి పట్టి అంత్యక్రియలను నిర్వహించింది.