'వరంగల్‌లో వార్ వన్ సైడ్' | MP Kavitha criticized the central government | Sakshi
Sakshi News home page

'వరంగల్‌లో వార్ వన్ సైడ్'

Nov 10 2015 4:31 PM | Updated on Aug 9 2018 4:51 PM

రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత జోస్యం చెప్పారు.

రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత జోస్యం చెప్పారు. మంగళవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల సమస్యలను కేంద్రానికి ఎన్నిసార్లు వివరించినా.. ఫలితం లేకుండా పోతోందని విమర్శించారు.

 

సమస్యలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. 16నెలలుగా హైకోర్టు విభజన కోసం ఉద్యమాలు చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఉప ఎన్నికపై విలేకర్లు  అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... 'వరంగల్ లో వార్ వన్ సైడ్' అంటూ స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement