కవిత టీఆర్‌ఎస్‌కు ఈసీ ఆమోదం.. ఇక్కడే ఓ ట్విస్ట్‌! | EC Clearance For Kavitha TRS Party | Sakshi
Sakshi News home page

కవిత టీఆర్‌ఎస్‌కు ఈసీ ఆమోదం.. ఇక్కడే ఓ ట్విస్ట్‌!

Apr 30 2026 1:38 PM | Updated on Apr 30 2026 2:05 PM

EC Clearance For Kavitha TRS Party

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో పార్టీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆమె కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. 

తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ లోపించిందని.. అందుకే తాను కొత్త పార్టీ పెట్టానని ఆమె ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. అయితే.. ఆ ప్రకటన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒరిజినల్‌.. ఒరిజినలేనంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ సెటైర్లు వేసింది. అదే సమయంలో ఆమె పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 

ఈ క్రమంలో ఆ అభ్యంతరాలను పరిశీలించిన ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు మీద కాకుండా.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత పార్టీకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు సంబంధిత లేఖను అందజేసినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement