దాడి కేసులో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ | mim corporator arrested in old city Conflicts | Sakshi
Sakshi News home page

దాడి కేసులో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

Feb 9 2016 8:16 PM | Updated on Aug 20 2018 4:44 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నాయకులపై దాడి చేసిన కేసులో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్‌తో పాటు మరో నలుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చాంద్రాయణగుట్ట: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నాయకులపై దాడి చేసిన కేసులో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్‌తో పాటు మరో నలుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ నెల 2వ తేదీన జంగమ్మెట్ డివిజన్ ఘాజీమిల్లత్ కాలనీలో బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్తో పాటు ఆయన అనుచరులపై ఎంఐఎం అభ్యర్థి ఎం.ఎ.రెహమాన్(49), అతని నలుగురి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితులపై 143, 147, 323, 181, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇదే ఘటనలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కూడా కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement