మేడ్చల్లో మున్నా దారుణ హత్య | man murdered in medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్లో మున్నా దారుణ హత్య

Aug 19 2016 10:11 AM | Updated on Jul 30 2018 9:16 PM

మేడ్చల్లోని శ్రీ జయదుర్గా హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది.

హైదరాబాద్ : మేడ్చల్లోని శ్రీ జయదుర్గా హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. హోటల్‌లో సప్లైర్‌గా పని చేస్తున్న మున్నా (35)  అనే వ్యక్తిని మరో సప్లైర్ రాజ్‌కుమార్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ పరారయ్యాడు. మిగతా సిబ్బంది వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని..  మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మున్నా, రాజ్కుమారుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణే ఈ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మున్నా స్వస్థలం మహారాష్ట్ర అని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement