రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం | Man loses life after lorry rams his cycle | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం

May 8 2015 10:41 AM | Updated on Oct 9 2018 5:39 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైల్వే ఉద్యోగి దుర్మరణం చెందాడు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైల్వే ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈరోజు ఉదయం రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మల్లేశం(40)  సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ అకస్మాత్తుగా తెరవడంతో మల్లేశం కింద పడ్డాడు.

అదే సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ కిందపడ్డ మల్లేశంపై  దూసుకు వెళ్లింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement