టీడీపీ వల్లే వ్యవస్థలన్నీ నాశనం | Koppula Ishwar fires on TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ వల్లే వ్యవస్థలన్నీ నాశనం

Nov 15 2016 1:08 AM | Updated on Aug 10 2018 8:23 PM

టీడీపీ వల్లే వ్యవస్థలన్నీ నాశనం - Sakshi

టీడీపీ వల్లే వ్యవస్థలన్నీ నాశనం

తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో తెలం గాణలోని వ్యవస్థల న్నీ నాశనమయ్యా యని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో తెలం గాణలోని వ్యవస్థల న్నీ నాశనమయ్యా యని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లోని విలువైన భూములను కాజేశారని, చెరువులను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మార్చారని దుయ్య బట్టారు. ప్రభుత్వంపై ఆ పార్టీ నేత రేవం త్‌రెడ్డి అనవసరంగా నోరు పారేసు కుంటు న్నారని సోమవారం ఒక ప్రకటనలో విమ ర్శించారు.

హైదరాబాద్ అభివృద్ధి గురించి పట్టించుకోనివారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రెండున్నరేళ్ల కిం దట అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్   హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసిందని విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఆంధ్రాబాబుల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి రేవంత్ తెలంగాణ కు చీడపు రుగులా మారారని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement