కేకే కుమార్తె ఆందోళన | kesava rao daughter protest at NBT Nagar | Sakshi
Sakshi News home page

కేకే కుమార్తె ఆందోళన

Feb 2 2016 12:07 PM | Updated on Sep 17 2018 6:08 PM

కేకే కుమార్తె ఆందోళన - Sakshi

కేకే కుమార్తె ఆందోళన

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి ఎన్ బీటీ నగర్ లో ఆందోళనకు దిగారు

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి మంగళవారం ఎన్ బీటీ నగర్ లో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటరు కార్డులున్నా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు.

మాసబ్ ట్యాంక్ లోని 36, 37 పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తార్నాకా డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోనూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయనీయడం లేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement