breaking news
NBT Nagar
-
ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం. 12 మీదుగా బైక్‌పై వెళుతుండగా రోడ్డు పక్క నుంచి ఎన్బీటీ నగర్ బస్తీకి చెందిన అభిమాని కనిపించాడు. దీంతో వెనుకాల కాన్వాయ్‌తో పాటు తన బైక్‌ను కూడా రోడ్డు పక్కన ఆపి అతడిని పలకరించారు. బైక్‌పై దూసుకెళ్తున్న అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారిగా బుల్లెట్ బండి దిగి రోడ్డుపై వెళుతున్న ఎన్బీటీ నగర్‌కు చెందిన శివకుమార్‌ను గుర్తు పట్టిన అసద్ ఆగడమే కాకుండా కుశలప్రశ్నలు వేశారు. అతడి తండ్రి ఒవైసీ పోటీ చేసినప్పుడు తాను బూత్ ఏజెంట్‌గా ఉండేవాడినని ఈ సందర్భంగా శివకుమార్ గుర్తు చేసుకున్నారు. స్వయంగా అసద్ బుల్లెట్ దిగి తనను పలకరించడంపట్ల శివకుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారంతా తమ సెల్ఫోన్లలో బంధించారు. (క్లిక్ చేయండి: ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్) -
కేకే కుమార్తె ఆందోళన
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి మంగళవారం ఎన్ బీటీ నగర్ లో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటరు కార్డులున్నా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ లోని 36, 37 పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తార్నాకా డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోనూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయనీయడం లేదని తెలిపారు. -
NBT నగర్ సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్