ఏపీ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురు | High court issues notice to andhra pradesh government, karem sivaji | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురు

Apr 26 2016 4:09 PM | Updated on Aug 31 2018 9:15 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది జ్యోతి ప్రసాద్ ...హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివాజీపై క్రిమనల్ కేసులు ఉన్నాయని, ఆయన ఎంపిక చట్టవిరుద్ధమంటూ జ్యోతిప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. అలాగే కారెం శివాజీ రికార్డులను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement