అది తెలంగాణ రాబందుల పార్టీ | Congress leader Madhu yaski Commetns on TRS party | Sakshi
Sakshi News home page

అది తెలంగాణ రాబందుల పార్టీ

Aug 26 2016 2:21 AM | Updated on Mar 18 2019 7:55 PM

అది తెలంగాణ రాబందుల పార్టీ - Sakshi

అది తెలంగాణ రాబందుల పార్టీ

ప్రాజెక్టుల రీడిజైనింగ్, మహారాష్ట్ర ఒప్పందం పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతినడానికి ప్రాజెక్టుల రీడిజైనింగ్పనిచేస్తోందనీ...

కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైనింగ్, మహారాష్ట్ర ఒప్పందం పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతినడానికి  టీఆర్‌ఎస్ పనిచేస్తోందనీ, అది తెలంగాణ రాబందుల పార్టీ అని ఏఐసీసీ అధికారప్రతినిధి మధుయాష్కీ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మహా ఒప్పందం పేరుతో మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) పెద్ద దోపిడీకి కుట్ర చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ‘కేసీఆర్‌కు పన్నీరు, ప్రజలకు కన్నీరు’ అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనతో చర్చలు, సూత్రప్రాయంగా ఒప్పందం జరిగిన విషయం తెలుసుకోలేని, చదువుకోలేని మూర్ఖులు టీఆర్‌ఎస్ నేతలన్నారు.

రాజీనామా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ పారిపోకుండా నిల బడాలని సవాల్ చే శారు. కేసులు పెడతానంటూ చేస్తున్న బెదిరింపులకు భ యపడేది లేదన్నా రు.  కేసీఆర్‌కు దమ్ముంటే తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని యాష్కీ అన్నారు.  
 
అహంకారం మంచిదికాదు: గండ్ర
సీఎం స్థానంలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు చెప్ప డం, అహంకారంతో మాట్లాడటం మంచిదికాదని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ కోసం నిబద్ధతతో కొట్లాడిన కాంగ్రెస్‌పై అనుచితం గా మాట్లాడటం మానుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement