'నేను పోటీ చేయను, సర్వేకి ఇవ్వండి' | congress leader digvijaya singh meets warangal district party leaders | Sakshi
Sakshi News home page

'నేను పోటీ చేయను, సర్వేకి ఇవ్వండి'

Oct 29 2015 3:28 PM | Updated on Mar 18 2019 7:55 PM

'నేను పోటీ చేయను, సర్వేకి ఇవ్వండి' - Sakshi

'నేను పోటీ చేయను, సర్వేకి ఇవ్వండి'

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు.

హైదరాబాద్ :  వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్  దిగ్విజయ్ సింగ్ గురువారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సేకరిస్తున్నారు.

మాజీ ఎంపీ వివేక్ ...ఈసారి పోటీ చేసేందుకు సముఖంగా లేనట్లు లేదు. ఆయనను పోటీకి ఒప్పించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించినా వివేక్ వైఖరిలో మార్పు లేదు.  తాను పోటీ చేయనని, సర్వే సత్యనారాయణకు టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

మరోవైపు ఓరుగల్లు నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ ...దిగ్విజయ్‌కు తన అభిప్రాయం తెలిపారు. కాగా పీసీసీ నుంచి జాబితా అందుకున్నా అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించనున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement