కేంద్రంపై దుష్ప్రచారం తగదు | BJP FIRES ON EATALA RAJENDHER | Sakshi
Sakshi News home page

కేంద్రంపై దుష్ప్రచారం తగదు

Feb 1 2018 3:48 AM | Updated on Mar 25 2019 3:09 PM

BJP FIRES ON EATALA RAJENDHER - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత జితేందర్‌రెడ్డిలు కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. వీరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి రూ.21,631 కోట్లు కేటాయించిందని, ఇందులో డిసెంబర్‌ నాటికి రూ.19,601 కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేసింది. వీటికి అదనంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మరో రూ.9వేల కోట్లు విడుదల చేసిందని తెలిపింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి పార్టీ మీడియాసెల్‌ కన్వీనర్‌ సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడుతూ... గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రూ.3,56,375 కోట్లు కాగా అందులో కేంద్రం నుంచి పొందిన నిధులే రూ 1,58,000 కోట్లని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement