బోర్ విషయమై ఎంపీటీసీ భర్తపై దాడి | attack on mptc husband in hyderabad pahadi sharif area | Sakshi
Sakshi News home page

బోర్ విషయమై ఎంపీటీసీ భర్తపై దాడి

Jan 10 2016 11:22 PM | Updated on Sep 4 2018 5:07 PM

బోర్ వేసే విషయంలో తలెత్తిన వివాదంతో ఎంపీటీసీ భర్తపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

హైదరాబాద్: బోర్ వేసే విషయంలో తలెత్తిన వివాదంతో ఎంపీటీసీ భర్తపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ షాహెదా భర్త హామెద్(40) ఆదివారం ఉదయం ఎర్రకుంటలో బోర్ వేయిస్తున్నాడు. బాసిత్‌ఖాన్, షేక్ మస్తాన్, మహ్మద్ షకీల్‌లు బోర్ వేయరాదంటూ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో 60 ఫీట్లు మాత్రమే బోర్ వేసి వెనుదిరిగారు. బాసిత్‌ఖాన్, మస్తాన్, షకీల్‌లు ఎంపీటీసీ భర్త హామేద్ ఖాన్‌పై సాయంత్రం ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలకు గురైన హామెద్‌ను స్థానికులు వెంటనే బాలాపూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement