విమానం అత్యవసర ల్యాండింగ్ | aeroplane emergency landing in hyderabad | Sakshi
Sakshi News home page

విమానం అత్యవసర ల్యాండింగ్

Aug 1 2015 9:24 PM | Updated on Sep 3 2017 6:35 AM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది.

శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చేసింది. వివరాలు.. శనివారం సాయంత్రం 6.53 గంటలకు శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా-514 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఏటీసీ అనుమతితో తిరిగి 7.11 గంటలకు విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ నిపుణులు విమానానికి మరమ్మతులు చేస్తున్నారు. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement