పేకాట స్ధావరాలపై దాడి, మహిళల సహా 8మంది అరెస్ట్ | 8 gamblers arrested by Cyberabad Police | Sakshi
Sakshi News home page

పేకాట స్ధావరాలపై దాడి, మహిళల సహా 8మంది అరెస్ట్

Nov 14 2014 8:49 AM | Updated on Sep 17 2018 6:26 PM

పేకాట స్ధావరాలపై సైబారాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

హైదరాబాద్ : పేకాట స్ధావరాలపై  సైబారాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు  గత కొంతకాలంగా నగర శివారు ప్రాంతాలను అడ్డాగా  చేసుకుని ఇష్టానుసారంగా జరుగుతున్న పేకాట స్థావరాలపై నిరంతరంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో అడ్డా గుట్టురట్టయింది. 

 

15 రోజుల క్రితం రామంతాపుర్‌లో ఓ ఇంటిపై  ఎస్వోటీ సీఐ పుష్పన్‌కుమార్‌ అధ్వర్యంలో  జరిపిన దాడిలో పురుషులతో పాటు  ముగ్గురు మహిళలు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా నిన్నరాతి ఎస్వోటీ సీఐ వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో మణికొండలోని ల్యాంకో హిల్స్ ఫ్లాట్లో జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిదిమంది ప్రముఖ వ్యక్తులు అడ్డంగా బుక్కయిపోయారు.  వీరి వద్ద నుంచి రూ.3.48 లక్షల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement