'దళితుల భూముల జోలికి వస్తే..' | ysrcp leader slams chandrababu | Sakshi
Sakshi News home page

'దళితుల భూముల జోలికి వస్తే..'

Oct 3 2015 1:56 PM | Updated on Sep 15 2018 3:01 PM

చంద్రబాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ లను మోసం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున ఆరోపించారు.

హైదరాబాద్ : చంద్రబాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ లను మోసం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,  ఆ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున  ఆరోపించారు. ఆయనిక్కడ శనివారం హైదరాబాద్ లో మాట్లాడుతూ ... రాజధాని ప్రాంతంలోని దళితుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కును కాలరాస్తారా అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. దళితుల భూముల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త అని ప్రభుత్వాన్ని నాగార్జున హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement