నూనె మిల్లులో ప్రమాదం: కార్మికురాలు మృతి | Woman dies in freak accident | Sakshi
Sakshi News home page

నూనె మిల్లులో ప్రమాదం: కార్మికురాలు మృతి

Jan 11 2016 6:25 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆయిల్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఓ కార్మికురాలు మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని గొల్లగూడెంలో వాసవి ఆయిల్ మిల్లులో దేశబోయిన కవిత (25) కార్మికురాలిగా పనిచేస్తోంది.

పాల్వంచ టౌన్ (ఖమ్మం) : ఆయిల్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఓ కార్మికురాలు మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని గొల్లగూడెంలో వాసవి ఆయిల్ మిల్లులో దేశబోయిన కవిత (25) కార్మికురాలిగా పనిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం మిల్లులో పల్లీలను పోస్తున్న సమయంలో ఆమె చీర కొంగు మిషన్‌కు చుట్టుకోవడంతో అది ఆమె మెడకు ఉచ్చులా బిగుసుకుంది. దీంతో ఊపిరాడక కవిత ప్రాణాలు కోల్పోయింది. కవితకు భర్త కన్నస్వామి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement