క్షుద్రపూజలు: కన్నబిడ్డను చంపిన తండ్రి | 3 months baby murdered by father due to occult rituals in ongole district | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజలు: కన్నబిడ్డను చంపిన తండ్రి

Nov 23 2015 10:04 AM | Updated on Sep 3 2017 12:54 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. క్షద్రపూజల కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చాడో తండ్రి.

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. క్షద్రపూజల కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చాడో తండ్రి. స్థానిక మదర్‌థెరిస్సా కాలనీకి చెందిన సద్ది రాజిరెడ్డి అలియాస్ దెయ్యాల రాజిరెడ్డి జాతకాలు చెబుతుంటాడు. రాజిరెడ్డి ఓ మహిళతో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. వారికి మూడు నెలల బాబు ఉన్నాడు.

చిన్నారిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి రాజిరెడ్డి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement