భూకుంభకోణంలో కొత్తకోణం | The new angle in the scandal | Sakshi
Sakshi News home page

భూకుంభకోణంలో కొత్తకోణం

Dec 11 2017 4:24 PM | Updated on Jul 6 2019 12:52 PM

గుంటూరు : నిజాంప‌ట్నం మండ‌లం దిండి ప్ర‌భుత్వ భూముల కుంభకోణంలో కోత్త కోణం వెలుగులోకి వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. ప్ర‌భుత్వ భూముల్లో  చేప‌ల చెరువులు ఉన్న‌ట్లు రికార్డులు సృష్టించి  బ్యాంకుల  ద్వారా తెలుగు తమ్ముళ్లు ఆరు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని వెల్లడించారు.  తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌భుత్వ సొమ్మును కొట్టేయడాన్ని ఆధారాలతో క‌లెక్ట‌ర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

దిండిలో తెలుగుదేశం నేత‌లు చేసిన కుంభ‌కోణం పై పూర్తి స్ధాయిలో  విచార‌ణ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ కుంభ‌కోణానికి సంబంధించి మా ద‌గ్గ‌ర పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్దమని, ప్ర‌భుత్వ భూముల్నికాపాడాలని వెంకటరమణ కోరారు. క‌బ్జాచేసిన వారి పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలని, భూములు స్వాధీనం చేసుకుని వెంట‌నే వాటిని దిండి గ్రామంలోని పేద‌లు పంచాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement