సమ్మర్‌ బాత్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ బాత్‌

Apr 17 2018 12:14 AM | Updated on Apr 17 2018 12:14 AM

beauty tips - Sakshi

ఒక లీటరు నీటిలో మల్లె, జాజి వంటి పూలకు లేదా గులాబీ రెక్కలను వేసి మరిగించి చల్లారిన తర్వాత స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా తాజాగా, హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇది నాచురల్‌ డియోడరెంట్‌గా పనిచేస్తుంది.
     
తాజా పూలు సాధ్యం కానప్పుడు ఈ పూల తాలూకు సువాసనతోకూడిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ వాడవచ్చు. స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్స్‌ వాడేటప్పుడు ముందుగా అర మగ్గు నీటిలో ఆయిల్‌ వేసి బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం నీటిలో పోయాలి. 

Advertisement
 
Advertisement
Advertisement