సైకిలెక్కిన మండలి, పిన్నమనేని | pinamaneni join in tdp | Sakshi
Sakshi News home page

సైకిలెక్కిన మండలి, పిన్నమనేని

Apr 3 2014 1:29 AM | Updated on Aug 10 2018 8:01 PM

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణ వీరయ్య బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 ‘కన్నెర్ర చేస్తే..’ అంటూ టీవీ చానళ్లపై బాబు చిందులు

 హైదరాబాద్: కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణ వీరయ్య బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పసుపు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ వారు, పాతవారు కలుపుకుని పనిచేయాలని ఈ సందర్భంగా బాబు సూచించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వస్తున్న సర్వే వివరాలను ప్రసారం చేసిన టీవీ చానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకటి రెండు, టీవీ చానళ్లు నాకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నాయి. నాపై బురద చల్లుతున్నాయి. వారు అలా చేస్తే నేను కన్నెర్ర చేయాల్సి వస్తుంది. అపుడు వారు ఏమవుతారో ఆలోచించుకోవాలి’’ అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement