'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు | kottapalli geetha takes on sabbam hari | Sakshi
Sakshi News home page

'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు

May 6 2014 2:56 PM | Updated on Mar 25 2019 3:03 PM

'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు - Sakshi

'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు

సబ్బం హరిపై అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కొత్తపల్లి గీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విశాఖ : సబ్బం హరిపై అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కొత్తపల్లి గీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనంతో సంబంధం లేని నేత సబ్బం హరి అని అన్నారు. ఫలానా పార్టీకి ఓటెయండంటూ సబ్బం హరి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు.

సబ్బం హరి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని కొత్తపల్లి గీతా అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంత తప్పదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

 

Advertisement
 
Advertisement
Advertisement