అందరి సంక్షేమానికి కృషి చేసేది జగనే.. | everyone's welfare hardworker doing as jagan | Sakshi
Sakshi News home page

అందరి సంక్షేమానికి కృషి చేసేది జగనే..

Apr 26 2014 2:54 AM | Updated on Aug 14 2018 4:32 PM

అందరి సంక్షేమానికి కృషి చేసేది జగనే.. - Sakshi

అందరి సంక్షేమానికి కృషి చేసేది జగనే..

పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిలా కృషి చేసేది..

వైఎస్‌ఆర్‌సీపీ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుజయ్‌కృష్ణరంగారావు

 బొబ్బిలి రూరల్, న్యూస్‌లైన్ : పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిలా కృషి చేసేది ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని, రాష్ట్రంలో మరలా సంక్షేమ పాలన రావాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, బొబ్బిలి నియోజకవర్గ అభ్యర్థి ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు.

 శుక్రవారం మండలంలోని రాజుపేట, సీతయ్యపేట, దిబ్బగుడ్డివలస, చిత్రకోటబొడ్డవలస, ఎ.వెలగవలస, వెంకటరాయుడిపేట, గోపాలరాయుడిపేట, నారశింహునిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్‌ఆర్ పేదల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా పని చేశారని గుర్తు చేశారు. అందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు అందించారని, పేదలకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించారని చెప్పారు.


 ఈ ప్రాంతాభివృద్ధికి మహానేత ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలు నెరవేరాలంటే జగన్‌ను మనం ముఖ్యమంత్రిని చేయాలన్నారు. తాము నిస్వార్థంగా రాజకీయాలు చేసి ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేశామని, తమకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. తనను ఎమ్మెల్యేగా, తన సోదరుడు బేబీనాయనను ఎంపీగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బేతనపల్లి శివున్నాయుడు, చింతాడ జయప్రదీప్‌కుమార్, గేదెల సత్యనారాయణ, గర్భాపు పరశురాం, నాగిరెడ్డి రామారావు, అల్లు కిశోర్, చుక్క రమణ, తమ్మిరెడ్డి దామోదరరావు, గొర్లె వెంకటనాయుడు, ముడసల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement